ఎల్‌పీయూకు నిప్పు!
యూనివర్సిటీ హాస్టల్లో ఒక విద్యార్థినిపై లైంగిక దాడి చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందన్న వార్త సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం కావడంతో పంజాబ్‌లో ఫగ్వారాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) విద్యార్థులు ఆగ్రహోదగ్రులయ్యారు. శనివారం రాత్రి వేలాది మంది విద్యార్థులు క్యాంపస్‌లో విధ్వంసం సృష్టించారు. క్యాంపస్‌లోని వస్తువులను ధ్వంసం చేయడమే కాక, భవనంలోని కొంత భాగానికి నిప్పంటించారు.
- విద్యార్థినిపై లైంగిక దాడి వార్తలతో భగ్గుమన్న విద్యార్థులు
- యూనివర్సిటీలో విధ్వంసం
- జాతీయ రహదారిపై బైఠాయింపు
- వార్తలు నిరాధారమన్న యూనివర్సిటీ యాజమాన్యం
జలంధర్, సెప్టెంబర్ 27: యూనివర్సిటీ హాస్టల్లో ఒక విద్యార్థినిపై లైంగిక దాడి చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందన్న వార్త సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం కావడంతో పంజాబ్‌లో ఫగ్వారాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) విద్యార్థులు ఆగ్రహోదగ్రులయ్యారు. శనివారం రాత్రి వేలాది మంది విద్యార్థులు క్యాంపస్‌లో విధ్వంసం సృష్టించారు. క్యాంపస్‌లోని వస్తువులను ధ్వంసం చేయడమే కాక, భవనంలోని కొంత భాగానికి నిప్పంటించారు. రాత్రి 2.30 గంటలకు యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు బైఠాయించి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కల్పించారు.
దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ యూనివర్సిటీ బీజేపీ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్‌కు చెందినది. అయితే విద్యార్థినిపై లైంగిక దాడి జరిగినట్టు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అలాంటి ఘటన జరిగినట్టు ఎలాంటి ఆధారం లేదని డీఐజీ నవీన్ సింగ్లా తెలిపారు. అయితే ఈ ఆరోపణలపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. క్యాంపస్ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగినట్టు వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని యూనివర్సిటీ యంత్రాంగం పేర్కొంది.
క్యాంపస్ బయట నుంచి వచ్చిన కొందరు దుండుగులు హాస్టల్-3కి చెందిన ఒక విద్యార్థినిపై లైంగిక దాడి చేశారని శనివారం రాత్రి ఒక మెసేజ్ విస్తృతంగా వైరల్ అయ్యింది. ఇది చూసిన వెంటనే విద్యార్థులు గర్ల్స్ హాస్టల్ వద్దకు పెద్దయెత్తున చేరుకుని హాస్టల్ భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నించారు. తర్వాత నినాదాలు చేస్తూ క్యాంపస్‌లోని ఆస్తులను ధ్వంసం చేయడం ప్రారంభించారు. కొంత భాగానికి నిప్పు కూడా పెట్టారు. తర్వాత వారు మెయిన్ గేట్‌వైపు దూసుకెళ్లి చండీగఢ్-అమృత్సర్ జాతీయ రహదారిపై బైఠాయించి దానిని దిగ్బంధించారు. ఆదివారం రాత్రి విద్యార్థులు పలు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

