ఏసీలు, టీవీలు మరింత ప్రియం
పండుగ సీజన్లో ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉన్నది. అక్టోబర్ 1 నుంచి ఏసీలు, ఎల్ఈడీ టీవీలు, వాషింగ్మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి ఉత్పత్తుల ధరలను కంపెనీలు 8% వరకు పెంచనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రాగి, ఉక్కు, అల్యూమినియం, ముడిచమురు, ఇతర ముడి పదార్థాల ధరలు పెరుగడంతోపాటు కరెన్సీ మారకపు విలువల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకోవడంతో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 2026లో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఇది మూడోవిడత ధరల పెంపు కానున్నది.
- అక్టోబర్ 1 నుంచి పెరుగనున్న ధరలు
- 5 నుంచి 8% వరకు పెరిగే అవకాశం
- ఈ ఏడాది ఇది మూడో విడత పెంపు
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉన్నది. అక్టోబర్ 1 నుంచి ఏసీలు, ఎల్ఈడీ టీవీలు, వాషింగ్మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి ఉత్పత్తుల ధరలను కంపెనీలు 8% వరకు పెంచనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రాగి, ఉక్కు, అల్యూమినియం, ముడిచమురు, ఇతర ముడి పదార్థాల ధరలు పెరుగడంతోపాటు కరెన్సీ మారకపు విలువల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకోవడంతో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 2026లో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఇది మూడోవిడత ధరల పెంపు కానున్నది.
పరిశ్రమ నిపుణుల ప్రకారం, ఎయిర్ కండిషనర్ల ధరలు అత్యధికంగా 5 నుంచి 8% వరకు పెరుగనున్నాయి. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎల్ఈడీ టీవీల ధరలు 3 నుంచి 4% వరకు పెరిగే అవకాశం ఉన్నది. బ్లూస్టార్, గోద్రెజ్ అప్లయన్సెస్, హైయర్, డైకిన్, సూపర్ ప్లాస్ట్రానిక్స్ వంటి కంపెనీలు ఇప్పటికే వివిధ విభాగాల్లో 4-10% వరకు ధరల పెంపును ప్రకటించాయి. పానాసోనిక్ మాత్రం పరిస్థితిని ఇంకా పరిశీలిస్తున్నట్టు తెలిపింది. ఎల్జీ, హిటాచీ, బాష్ హోమ్ కంఫర్ట్ కూడా ఏసీ ధరలను సుమారు 5% పెంచాయి. బ్లూస్టార్ ఎండీ త్యాగరాజన్ మాట్లాడుతూ, కమోడిటీ ధరలు పెరుగడంతో ఏసీలు, డీప్ ఫ్రీజర్ల ధరలు ఇప్పటికే 5-8% పెరిగాయన్నారు.
నెల నుంచి నెలన్నర వరకు సరిపడే స్టాక్ పైప్లైన్లో ఉన్నదని గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది చెప్పారు. అంటే దీపావళి తర్వాత కొత్త ధరలు కచ్చితంగా అమల్లోకి వస్తాయని తెలిపారు. ముడిసరుకుల ధరలు ఇలానే పెరుగుతుంటే మళ్లీ జనవరిలో ధరలను పెంచే అవకాశం ఉన్నదని హైయర్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ అన్నారు. ఇప్పటి నుంచి జనవరి వరకు మొత్తం సుమారు 15% ధరల పెంపు చేయాలని హైయర్ యోచిస్తున్నదని తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 5%, డిసెంబర్లో మరో 5%, జనవరిలో మరో 5% పెంపు ఉండవచ్చని అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

