MLA Sri Ganesh | కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్‌కు బస్తీ వాసుల నిరసన సెగ.. వీడియో
MLA Sri Ganesh | కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అంబేద్కర్ హట్స్ బస్తీ వాసులకు బీఆర్ఎస్ అండగా నిలవడంతో ఎట్టకేలకు బీజేపీ కంటోన్మెంట్ బోర్డ్ సభ్యురాలు, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సెగ తగలింది. వారు బుధవారం అంబేద్కర్ హాట్స్‌లో పర్యటించారు.
MLA Sri Ganesh | కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అంబేద్కర్ హట్స్ పరిధిలో 40 ఏళ్లుగా నివసిస్తున్న 650 కుటుంబాల గుడిసెలను బుల్డోజర్లతో కూల్చే యత్నం చేయడంతో బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ బుల్డోజర్కు అడ్డంగా వెళ్లి పేదల ఇండ్లు కూల్చకుండా అడ్డుకున్నారని తెలిసిందే.
బస్తీ వాసులకు బీఆర్ఎస్ అండగా నిలవడంతో ఎట్టకేలకు బీజేపీ కంటోన్మెంట్ బోర్డ్ సభ్యురాలు, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సెగ తగలింది. వారు బుధవారం అంబేద్కర్ హాట్స్‌లో పర్యటించారు. ఈ క్రమంలో 40 ఏళ్ల నుంచి నివసిస్తున్న తమ ఇండ్లను ఎలా కూల్చివేస్తారంటూ పేదలు ఎమ్మెల్యే శ్రీ గణేష్‌తోపాటు బీజేపీ కంటోన్మెంట్ బోర్డ్ సభ్యురాలిని నిలదీశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజలు
కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు, బీజేపీ కంటోన్మెంట్ బోర్డ్ సభ్యురాలుకు నిరసన సెగ
40 ఏళ్ల నుంచి అంబేద్కర్ హాట్స్ లో నివసిస్తున్న పేదల ఇంటిపైకి బుల్డోజర్ తీసుకెళ్లి కూల్చేస్తామని హెచ్చరించిన అధికారులు
దీంతో బస్తీ వాసులకు అండగా నిలిచిన… https://t.co/ffPFeijyAb pic.twitter.com/hk6GPFQmP5
— Telugu Scribe (@TeluguScribe) June 17, 2026
బస్తీవాసులతో మన్నె క్రిశాంక్ ఏమన్నాడంటే..
బోయిన్‌పల్లిలో 8 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ 6 వేల మందికి ఇందిరమ్మ ఇండ్లు కడతామని చెప్పిర్రు. ఇప్పుడు ఆ జాగను కూడా ప్రైవేట్ వాళ్లు వచ్చి తీసుకున్నరు. ప్రభుత్వ భూమి అక్కడ రేపటి రోజున 6 వేల ఇండ్లు కడతారంటే మనకు వస్తయి కావొచ్చని మీరు అనుకుంటరు. ఇప్పుడు ఆ జాగ కూడా లేదు. ప్రైవేట్ వాళ్లు వచ్చి 100 మంది గూండాలను పెట్టి అక్కడ హద్దులు పెట్టేసుకున్నరు. 10 రోజులైతే ఎమ్మెల్యే ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.
మీ గుడిసెలు కూల్చేసిన తర్వాత ఆ ఇండ్లు ఒక్క సంవత్సరం కడ్తరా.. రెండేళ్లు కడతరా.. ఆయన మళ్లీ ప్రభుత్వంలోకి వస్తడా దేవుడెరుగు. అప్పుడు మీరెక్కడ బతుకతరో తెల్వదు. రేపు మీరు ఆఫీసుల చుట్టూ తిరిగితే చూస్తం.. చేస్తమని 15 రోజులు పోతది. మీ అందరికీ ఓటర్ ఐడీలున్నయ్ కదా.. మనమంతా కోర్టుకు పోదాం.. వచ్చే దారిలోనే కేటీఆర్‌తో మాట్లాడిన. మీకు రూపాయి ఖర్చు కాకుండా మేం చూసుకుంటమని మన్నె క్రిశాంక్ భరోసా ఇచ్చారు. ఇక్కడ అన్నిపార్టీలకు ఓట్లేసినోళ్లున్నరు. కానీ రాత్రికి రాత్రే వచ్చి మీరంతా ఖాళీ చేయండంటే యాడికి పోవాలి అందరూ అని మన్నెక్రిశాంక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ ఇండ్ల కోసం నేను న్యాయపోరాటం చేస్తానని పేదలు, బస్తీ వాసులకి హామీనిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై న్యాయపరంగా పోరాడి, తమకు అండగా ఉంటానని బాధితులకు కేటిఆర్ హామీనిచ్చినట్టు మన్నె క్రిశాంక్ తెలిపారు.
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ ఇండ్ల కోసం నేను న్యాయపోరాటం చేస్తాను
కాంగ్రెస్ ప్రభుత్వంపై న్యాయపరంగా పోరాడి, తమకు అండగా ఉంటానని బాధితులకు కేటిఆర్ హామీ
కంటోన్మెంట్ నియోజకవర్గంలో పేదల ఇండ్లు కూల్చే కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అంబేద్కర్ హట్స్… https://t.co/QyzhoSp7tV pic.twitter.com/oaANAXvnZN
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2026
Read Also :
Pawan Kalyan | అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానిని పరామర్శించిన పవన్ కల్యాణ్
KTR | పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలి : కేటీఆర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

