బస్తీబాట అట్టర్ ఫ్లాప్
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని ఎలాంటి అవాంతరాలు లేకుండా అందించేందుకు జలమండలి చేపట్టిన బస్తీబాట అట్టర్ ఫ్లాప్ అవుతున్నది. ఎండలు తీవ్రమైన నేపథ్యంలో ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడంలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు.
- తాగునీటి కోసం రోడ్డెక్కుతున్న నగర ప్రజలు
సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని ఎలాంటి అవాంతరాలు లేకుండా అందించేందుకు జలమండలి చేపట్టిన బస్తీబాట అట్టర్ ఫ్లాప్ అవుతున్నది. ఎండలు తీవ్రమైన నేపథ్యంలో ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడంలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. జలమండలి పరిధిలో నిత్యం ఎక్కడో ఒకచోట ప్రజలు నీటి కోసం రోడ్డెక్కుతున్నారు. సరఫరా నిలిచిపోవడం, లోప్రెషర్, కలుషితనీరు సరఫరా కావడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు.
బిందెలు పట్టుకుని పలు కాలనీల ప్రజలు జలమండలి రిజర్వాయర్లను ముట్టడిస్తున్నారు. కలుషిత నీటిని పట్టుకుని జలమండలి ప్రధాన కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఒకవైపు అధికారులు ప్రతిరోజు ఉదయమే క్షేత్రస్థాయిలో పర్యటించి వినియోగదారుల సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించాలనే ప్రధాన ఉద్దేశంతో బస్తీబాట కార్యక్రమాన్ని చేపట్టారు. అది కాస్తా ఆరంభ శూరత్వంగా మారింది.
నీటి సమస్యలు లేనప్పుడు కాలనీల్లో తెగ తిరిగిన అధికారులు.. ఎండల తీవ్రత పెరిగిపోయి… సరిగ్గా సరఫరా కాకపోవడంతో జనం రోడ్డెక్కుతుంటే మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బస్తీ బాట పేరుకే చేపడుతున్నారని.. ఎక్కడా తాగునీటి సమస్యను మాత్రం పరిష్కరించడం లేదని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. రోజుకో ప్రాంతంలో నీటి ఎద్దడితో జలమండలి వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నా.. అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

