సికింద్రాబాద్, ఏప్రిల్ 20 : ఈ నెల 23వ తేదీన బంగారు మైసమ్మ ఆలయంలో నిర్వహించే అమ్మవారి కల్యాణానికి రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుకు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం అందించారు. సీతాఫల్ మండి డివిజన్ పరిధిలోని మధురా నగర్ కాలనీ బంగారు మైసమ్మ దేవాలయం 9వ వార్షికోత్సవం సందర్బంగా ఈ నెల 23న అమ్మవారి కల్యాణ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ గుర్రం పవన్ గౌడ్ తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే పద్మారావును కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అలకుంట హరి, ఆలయ సభ్యులు, ఢిల్లీ బాలిరెడ్డి, సంగం జగదీశ్వర్, శ్రీకాంత్ రెడ్డి, శైలందర్, టాటా స్కై శ్రీనివాస్, అజిజ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.