రామంతపూర్, ఫిబ్రవరి 15: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ సంతోష్ రావు ఆదేశాల మేరకు వృక్షార్చనలో భాగంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గంధం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోస్టర్‌ను ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి (Bandari Lakshma Reddy) శనివారం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ రెడ్డి, అనిల్, గౌతమ్ ప్రసాద్ పవన్, ప్రవీణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ పుట్టిన రోజున వృక్షార్చన
ఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న వృక్షార్చన నిర్వహించనున్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపిన విషయం తెలిసిందే. వచ్చే సోమవారం ప్రతి ఒకరూ మూడు మొకలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒకరూ మొకలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవటమే కేసీఆర్‌కు మనం ఇచ్చే పుట్టినరోజు కానుక అని చెప్పారు. హరిత తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ సంకల్పానికి మద్దతుగా చంద్రునికో నూలు పోగులా గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ వృక్షార్చన కార్యక్రమాన్ని తలపెట్టినట్టు పేర్కొన్నారు.