అమీర్పేట, జూలై 2: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవం కనులపండువగా జరిగింది. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించారు.
అనంతరం రాత్రి 10 గంటలకు ఉత్సవయాత్ర తిరిగి దేవాలయానికి చేరడంతో మూడు రోజులపాటు కొనసాగిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవాలు వైభవంగా ముగిశాయి.