GHMC | సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బల్దియా కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. వివిధ అభివృద్ధి పనులకు రావాల్సిన రూ.1500 కోట్ల మేర బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
దాదాపు రెండున్నర గంటల పాటు నిరసన తెలిపారు. ఈ నెల 5వ తేదీలోగా బకాయిలను చెల్లించకుంటే జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.