Ilambarithi IAS | మియాపూర్, ఫిబ్రవరి 16 : కూడళ్ల అభివృద్ధి సుందరీ కరణ పనులను పకడ్బందీగా చేపట్టేందుకు ఆయా విభాగాలు సమన్వయంతో పనిచేయాలని బల్దియా కమిషనర్ ఇలంబర్తి (Ilambarithi) పేర్కొన్నారు. త్వరలో పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందస్తుగా తగు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
హెచ్సీటీ పనులలో భాగంగా శేరిలింగంపల్లి జోన్ పరిధిలో సుందరీకరించనున్న కూడళ్లను హెచ్ఎండీఏ సహా పలు శాఖల అధికారులతో కలిసి కమిషనర్ ఇలంబర్తి ఇవాళ పరిశీలించారు. బస్సులో తిరిగి గచ్చిబౌలి త్రిబుల్ ఐటీ, డిఎల్ఎఫ్ ,ఖాజాగూడ, చందానగర్ లింగంపల్లి , ఆల్విన్ క్రాస్ రోడ్స్ సహా పలు కూడళ్లను కమిషనర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. త్వరలో ఆరంభం కానున్న నేపథ్యంలో స్థల సేకరణ విద్యుత్ స్తంభాలను పక్కకు మార్చడం కేబుళ్లు సహా ఇతర ఆటంకాలను తొలగించడం చేయాలని సూచించారు. కూడళ్లు సుందరంగా అభివృద్ధి పరిచి ప్రజలకు ఆహ్లాదం కల్పించేలా తయారు చేయాలని పేర్కొన్నారు.
హెచ్సీటీ పనులలో భాగంగా త్రిబుల్ ఐటీ జంక్షన్ జంక్షన్ వద్ద చేపట్టనున్న ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఆస్తుల సేకరణ, ఇతర అనుబంధ పనులను అధికారులతో చర్చించారు. కూడళ్ల అభివృద్ధికి ఆటంకం లేకుండా స్థల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కమిషనర్ ఇలం భర్తీ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్, పురపాలక శాఖ డిప్యూటీ సెక్రటరీ ప్రియాంక, వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి, జాయింట్ సీపీ డేవిస్, చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి, టీఎస్పీడీసీఎల్ అధికారులు శేఖర్, పాండ్యన్, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, రఘు ప్రసాద్ వేణుగోపాల్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ విభాగం సహా, డిప్యూటీ కమిషనర్లు, ఏసీపీలు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Kishan Reddy | బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృథా : కిషన్ రెడ్డి
MLA Vivekanand | ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తాం : ఎమ్మెల్యే వివేకానంద్
KCR | కేసీఆర్ జోలికొస్తే నాలుక చీరేస్తాం రేవంత్ రెడ్డి : బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్