హైదరాబాద్ : సికింద్రాబాద్ చిలకలగూడలో దారుణం చోటు చేసుకుంది. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న యవన్(23) అనే యువకుడిని ఎనిమిది మంది బైక్‌లపై వచ్చి నడిరోడ్డుపై నరికి చంపారు. యవన్ సీతాఫల్‌మండికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయి తల్లిదండ్రులు వీరి సంబంధాన్ని తీవ్రంగ వ్యతిరేకించారు. యవన్‌ను అమ్మాయికి దూరంగా ఉండాలని గతంలో హెచ్చరించినట్లు తెలిసింది.
అయినా కూడా యవన్ సదరు యువతిని కలిసేవాడని, ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి హత్యకు గురైనట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.