బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Jun 14, 2020 , 00:53:31

అలరించిన అబ్సెష్షన్‌ ఆర్ట్‌ షో

అలరించిన అబ్సెష్షన్‌ ఆర్ట్‌ షో

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ- సహాయ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రముఖ చిత్రకారుడు హరి లుకేమియా వ్యాధితో బాధపడుతున్న మాస్టర్‌ ఎస్‌జే ప్రసాద్‌ (15)కు చేయూతనిచ్చేందుకు ‘అబ్సెష్షన్‌' అనే తన 86వ సోలో చిత్రకళా ప్రదర్శనను శనివారం ప్రదర్శించారు. బంజారాహిల్స్‌ - నవీన్‌ నగర్‌  (సాయి కార్తీక్‌ ఎన్‌క్లేవ్‌)లోని వీఎస్‌ఎల్‌ విజువల్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ఈ ప్రదర్శనను మ్యాక్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ నవాబ్‌ మీర్‌ నజీర్‌ అలీఖాన్‌, తెలంగాణ - మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎండీ ఖమారుద్దీన్‌, డాక్టర్‌ ఆశిష్‌ చౌహాన్‌, అట్లూరి సుభాషిని, తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆవిష్కరించారు.  చిత్రకళా ప్రదర్శన ఆసాంతం కాన్వాస్‌పై ఆక్రిలిక్‌ మీడియాలో కొనసాగింది. కళాభిమానులు, వీక్షకులను ఈ ప్రదర్శన ఎంతగానో ఆకర్షిస్తున్నది. ఈ నెల 21  వరకు ఈ ప్రదర్శన కొనసాగుతోందని చిత్రకారుడు హరి తెలిపారు.