సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో తరలాలని రాష్ట్ర ఆటో యూనియన్ నాయకులు సమయాత్తమవుతున్నారు. కేసీఆర్ పాలన మళ్లీ రావాలంటూ నాచారంలో సోమవారం ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ తీశారు. ‘కేసీఆర్ పాలన కావాలి.. కాంగ్రెస్ పాలన పోవాలి’ అంటూ డ్రైవర్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్టీయూ రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడుతూ.. చావడమే మీకు దిక్కు అనేలా రాక్షస పాలన చేస్తున్న ప్రభు త్వం ఒక్క రేవంత్ ప్రభుత్వమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలతో ఆత్మహత్యలు చేసుకున్న ఒక్క ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఆటో జేఏసీ నాయకులు శాతం రమేశ్ మాట్లాడుతూ.. బూటకపు హామీలిచ్చి డ్రైవర్లను అన్ని విధాలుగా రేవంత్ సర్కార్ మోసంచేసిందని అన్నారు. కార్యక్రమంలో ఆటో జేఏసీ నాయకులు హయ్యద్ బాయ్, వెంకటేశ్, రమేశ్, కుమార్, అజార్, గోపాల్, ఎల్లయ్య, శ్రీనివాస్, రామాజంనేయులు, సాయికుమార్ పాల్గొన్నారు.