హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్లో దారుణం జరిగింది. తొమ్మిదేండ్ల బాలికపై ఓ ఆటో డ్రైవర్ మూడు రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఎన్టీఆర్ నగర్‌కు చెందిన సలీమ్.. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన పక్కింట్లో ఉన్న మైనర్ బాలికపై గత మూడు రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. విషయాన్ని బాధితురాలు తన తల్లితో చెప్పడంతో ఆమె ఎల్బీనగర్ పోలీసుకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సలీమ్‌ను అరెస్టుచేశారు. అతనిపై కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించారు.