బడంగ్ పేట్, మే 6 : ఉద్యోగులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఉద్యోగులు ఎప్పుడూ ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు కదా అన్నారు. ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చమంటే కాల్చుకొని తినుర్రి.. కొరుక్కొని తినుర్రి అని ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు సరికాదన్నారు.
ముఖ్యమంత్రి మాటలతో ప్రజలు విస్తూ పోతున్నారని ఆమె అన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ తీసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. పైసా అప్పు పుడుతలేదని, ఎవరూ నమ్మడం లేదని ముఖ్యమంత్రి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.