హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): రేవంత్ పాలనలో జరిగిన అన్యాయా న్ని జూబ్లీహిల్స్‌లో ఓటర్లకు వివరిస్తున్న నిరుద్యోగులపై కాంగ్రెస్ గూండాలు దాడిచేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. హస్తంపార్టీ నాయకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు కడారి స్వామియాదవ్, ప్రధాన కార్యదర్శి పరశు రాం, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పాండుగౌడ్తో కలిసి మాట్లాడారు.
బీఆర్ఎస్ గెలుపును ఆపలేరు : తుంగ బాలు
కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుపును ఆపలేరని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు స్పష్టంచేశారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటేయబోరని పేర్కొన్నారు.
బంద్‌కు బీఆర్ఎస్వీ మద్దతు : గెల్లు
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో కాలేజీల యాజమాన్యాలు ఇచ్చిన బంద్‌కు బీఆర్ఎస్వీ సంపూర్ణ మద్దతు ఉంటుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
దొంగఓట్ల నివారణకు చర్యలు తీసుకోవాలి
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో దొంగఓట్లను నివారణకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరుతూ రిటర్నింగ్ అధికారికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఫంక్షన్, కమ్యూనిటీ హాల్స్‌పై నిఘా ఉంచాలని ఆదివారం ఆర్వోకు వినతిపత్రం అందజేశారు.