హైదరాబాద్ : ఎల్బీనగర్ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. యాదగిరిగుట్ట దేవాలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ పై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు బీసీ సంఘాలు స్పందించాయి.
ఈశ్వరమ్మ యాదవ్ ఫ్లెక్సీలో జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా ఎలా వేశారని సురేష్ యాదవ్‌ను శివ చరణ్ రెడ్డి బూతులు తిట్టడంతో ఈశ్వరమ్మ యాదవ్ అనుచరులు ఎల్బీనగర్, మన్సూరాబాద్‌లోని శివ చరణ్ రెడ్డి ఇంటిపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు లాటిఛార్జ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఎల్బీనగర్లో కాంగ్రెస్ ఫ్లెక్సీ వార్
కాంగ్రెస్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ శివ చరణ్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన ఈశ్వరమ్మ యాదవ్ వర్గం
ఈశ్వరమ్మ యాదవ్ ఫ్లెక్సీలో జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా ఎలా వేశారని సురేష్ యాదవ్‌ను బూతులు తిట్టిన శివ చరణ్ రెడ్డి
ఎల్బీనగర్, మన్సూరాబాద్‌లోని… https://t.co/hkoYxJcsgU pic.twitter.com/A6iA57VsIT
— Telugu Scribe (@TeluguScribe) July 13, 2026