నిలోఫర్‌లో వైద్యుడిపై దాడి
నిలోఫర్ దవాఖానలో విధులలో ఉన్న వైద్యులపై ఇటీవల రోగి సహాయకులు దాడులకు పాల్పడటాన్ని నిరసిస్తూ సోమవారం పీజీ వైద్యులు విధులు బహిష్కరించి దవఖాన ఆవరణలో ఆందోళన చేపట్టా రు. దీంతో దవఖాన వైద్య సేవలలో అంతరా యం ఏర్పడటంతో రోగులకు తీవ్ర అసౌకర్యం కలిగింది.
- విధులు బహిష్కరించి నిరసన తెలిపిన పీజీ వైద్యులు
- బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
తెలుగు యూనివర్సిటీ, జూన్ 8: నిలోఫర్ దవాఖానలో విధులలో ఉన్న వైద్యులపై ఇటీవల రోగి సహాయకులు దాడులకు పాల్పడటాన్ని నిరసిస్తూ సోమవారం పీజీ వైద్యులు విధులు బహిష్కరించి దవఖాన ఆవరణలో ఆందోళన చేపట్టా రు. దీంతో దవఖాన వైద్య సేవలలో అంతరా యం ఏర్పడటంతో రోగులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. ఈ విషయమై దవాఖానలో భధ్రతను పర్యవేక్షించే ఎస్పీఎఫ్ పోలీసులకు, దవఖాన పరిపాలనా అధికారి, నాంపల్లి పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వారు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వైద్యులు విష్ణు, ధీరజ్, వంశీ మాట్లాడుతూ.. దాడి జరిగి మూడు రోజులు జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానని తీవ్రం గా ఖండిస్తున్నామన్నారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటివి పునరావృతం కాకుండా వైద్య సిబ్బ ందికి భధ్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. వైద్యుల నిరసన విషయం తెలుసుకున్న నాంపల్లి పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంపై సూపరింటెండెంట్ డాక్టర్ విజయకుమార్‌ను సంప్రదించగా విచారణ అనంతరం నిందితులపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు..
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

