సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆశంగారి కాలనీలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 80 ఎకరాల్లో ఉన్న గ్రీన్ జోన్, ఓపెన్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్‌గా మార్చినందుకు కాలనీవాసులు ముఖ్య మంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
- ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి
బడంగ్‌పేట, అక్టోబర్ 22: బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆశంగారి కాలనీలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 80 ఎకరాల్లో ఉన్న గ్రీన్ జోన్, ఓపెన్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్‌గా మార్చినందుకు కాలనీవాసులు ముఖ్య మంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కాలనీ వాసులు గజమాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ కొన్నేండ్ల నుంచి గ్రీన్ జోన్, ఓపెన్ జోన్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ఇండ్లు కట్టుకోవాలనుకున్న వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వక పోవడం, మున్సిపల్ శాఖ నుంచి అనుమతి ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడే వారన్నారు.
ప్రజల సమస్యను గుర్తించిన సీఎం కేసీఆర్ చట్టాలను మార్పు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించినందుకు ప్రతి ఒక్కరూ సీఎంకు ధన్యావాదాలు తెలుపాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యేగా తన బాధ్యతను నెరవేర్చుకున్నానని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలను పరిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. కార్యక్రమంలో బీమిడి స్వప్న, కాలనీ అధ్యక్షుడు ప్రమోద్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

