శంషాబాద్ రూరల్, అక్టోబర్ 23 : బాలికపై యువకుడు లైంగిక దాడి చేసిన ఘటన శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాలు.. మండలంలోని పిల్గోనిగూడకు చెందిన బాలిక ఈ నెల 18 న ఇంట్లో ఒంటరిగా ఉంది. వారి బంధువు నవీన్ పిల్గోనిగూడకు వచ్చి బాలిక ఇంటికి చేరుకున్నాడు.
సాయంత్రం సమయంలో నీళ్లు తాగుతానని చెప్పడంతో సదరు బాలిక ఇంట్లోని కిచెన్‌కు వెళ్లి నీళ్లు తీసుకురావడం కోసం వెళ్లగానే వెంటనే డోర్ వేసి బలవంతంగా లైంగిక దాడి చేసి పారిపోతుండగా బాలిక కేకలు వేసింది. స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయ గా తప్పించుకొని పారిపోయాడు. బాలిక తల్లి వెంకటమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.