సిటీ బ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): ప్రఖాత్య ఏసియా జ్యుయల్స్ షో హైటెక్ సిటీలోని హోటల్ ది వెస్టిన్లో అట్టహాసంగా ప్రారంభించారు. ప్రముఖ సినీతారలు హిమజ, అషురెడ్డి, మాల్వి మల్హోత్ర, అపూర్వ తదితరులు వేడుకలో పాల్గొన్నారు.
ఈనెల 15వరకు షో కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శనలో హై ఎండ్ ఫైన్ బ్రాండెడ్ బంగారు, వెండి, డైమండ్, పొల్కి వంటి ఆభరణాలతో పాటు సంప్రదాయ, వివాహ ఆభరణాలను ఉంచనున్నట్లు వెల్లడించారు.