Asha Worker | మల్కాజ్గిరి, మార్చి 13 : ఆశా వర్కర్‌పై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆశా వర్కర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మల్కాజ్గిరి చౌరస్తాలో బాధిత ఆశా వర్కర్ అయిన దళిత మహిళకు న్యాయం చేయాలని మల్కాజ్గిరి మండల కమిటీ ఆశా వర్కర్స్ యూనియన్ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ.. తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతుండడంతో భయాందోళనకు గురి అవుతున్నామని అన్నారు. అత్యాచారాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కీచకులను వదిలిపెడితే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఉందని, ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ మల్కాజ్గిరి మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా, మండల నాయకులు హేమలత, వసంత, రాణి, బాలమణి, శేశికళ, చంద్రకాంత, సంతోష, మాదవి, రాజ్యలక్ష్మి, నమ్రత, మీనా, అనురాధ, అర్చన, పావని, శాలిమ, పవిత్ర, సుజాత, భారతి, సురేఖ, మమత, మహిశ్వరి, సునీత, శాంతికుమారి, సుగంధ, స్వప్న, పద్మ, అలివేలు, రేణుక, సౌజన్య, మౌనిక, శిరీష, సరిత, భాగ్యలక్ష్మి, దివ్య, రోహిణి, సుగుణ, స్వాతి, స్వప్న, అనిత, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.