హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో(Road accident) ఏఆర్ ఎస్ఐ దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏఆర్ ఎస్ఐ రఘుపతి(59) తన బైకుపై ఉప్పల్ నుంచి అన్నోజిగూడ వెళ్తున్నాడు.
ఈ క్రమంలో వెనుకు నుంచి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.