విజయవాడ టూ హైదరాబాద్ ఎండీఎంఏ సైప్లె
డ్రగ్స్‌కు అలవాటు పడి ఆ తరువాత డ్రగ్ పెడ్లర్‌గా మారిన ఓ యుకువడిని కూకట్పల్లి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేయగా డ్రగ్స్ వినియోగిస్తున్న 8 మందిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి గ్యాంగ్‌కు చెందిన మరో ఇద్దరు సభ్యులు పరారీలో ఉన్నారు. మాదాపూర్ పోలీసులు, ఎస్వోటీ కూకట్పల్లి పోలీసులు.. చంద్రనాయక్ తండాలోని ఒక అపార్టుమెంట్‌పై దాడి చేశారు.
- మాదాపూర్‌లో నిరుద్యోగ యువతకు డ్రగ్స్ కిక్కు
- 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడు అరెస్ట్
సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్‌కు అలవాటు పడి ఆ తరువాత డ్రగ్ పెడ్లర్‌గా మారిన ఓ యుకువడిని కూకట్పల్లి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేయగా డ్రగ్స్ వినియోగిస్తున్న 8 మందిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి గ్యాంగ్‌కు చెందిన మరో ఇద్దరు సభ్యులు పరారీలో ఉన్నారు. మాదాపూర్ పోలీసులు, ఎస్వోటీ కూకట్పల్లి పోలీసులు.. చంద్రనాయక్ తండాలోని ఒక అపార్టుమెంట్‌పై దాడి చేశారు. అందులో విజయవాడకు చెందిన ధనేకుల తరుణ్ తేజ ఎండీఎంఏ డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఎండీఎంఏ, ఓజీ కుష్ గంజా డ్రగ్‌ను విజయవాడ నుంచి తెప్పించి, హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు వెల్లడించాడు.
విజయవాడ నుంచి కార్తీక్, పృథ్వీలు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తెలపడంతో ఆ ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అపార్టుమెంట్లో 8 మంది నిరుద్యోగ యువకులకు తరుణ్ తేజ్ డ్రగ్స్ సరఫరా చేయడంతో డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని పోలీలీసుల విచారణ వెల్లడైంది. నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 15 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, 382 గ్రాముల ఓజీ కుష్ గంజా, 9 మొబైల్ ఫోన్లు, రెండు వెయింగ్ మిషన్లు, డ్రగ్ సేవించే పరికరాలు, డ్రగ్ ప్యాకింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ పెడ్లర్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

