చార్మినార్, ఫిబ్రవరి 21: తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్క నర్సింహులు, టీటీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్ కుమార్ గౌడ్ (Aravind Kumar Goud) సూచించారు. టీడీపీ హైదరాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్ నాగు నగేశ్, సభ్యులు అన్వర్ హుసేన్ ఆధ్వ ర్యంలో పలువురు నేతలు వారిని శుక్రవారం కలిశారు.
బహదూర్‌పురా నియోజకవర్గంలో పెద్దసంఖ్యలో టీడీపీ సభ్యత్వ నమోదు చేయించామని తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు రవీందర్ గౌడ్ మాట్లాడుతూ దూద్‌బౌలి, మహరాజ్ గంజ్తోపాటు పలు ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాలు తీసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో మహ్మద్ అహ్మద్ షరీఫ్, ఎం.భార్గవ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.