సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ) : బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద గిరిజన విద్యార్థులకు పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది జిల్లాకు 41 సీట్లు కేటాయించారని, మూడో తరగతి (20 సీట్లు), ఐదో తరగతి (11) ఎనిమిదో తరగతి (10) కేటాయించినట్లు చెప్పారు. జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. జూన్ 6వతేదీలోపు దరఖాస్తులను లక్డీకాపూల్లోని స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్లో అందించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7780568955, 9849995875 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.