Ration Cards | మేడ్చల్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుదారులకు ఎదురు చూపులు తప్పడం లేదు. సర్కారు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం 3.98 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
అయితే అర్జీలు స్వీకరించి.. నెలలు గడుస్తున్నా..ఇప్పటి వరకు రేషన్‌కార్డులు మంజూరు కాకపోవడంపై దరఖాస్తుదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు కొత్త రేషన్ కార్డులు ఇస్తారా లేదా దరఖాస్తులకే పరిమితం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జిల్లావ్యాప్తంగా మొత్తం 5,23,899 రేషన్ కార్డులు ఉండగా, ప్రతి నెలా 10,636,765 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు.