చార్మినార్, ఏప్రిల్ 30 : అవినీతి ఆరోపణలతో బండ్లగూడ ఆర్టీవో ఆఫీస్‌లో పనిచేసిన ఏవో అడ్మినిస్ట్రేటివ్ అధికారిణి బి సునీతపై ఉన్నతధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. ఆమె అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిన గత చరిత్రను ఉన్నతధికారులు గుర్తించారు. ఆమె ఎక్కడ విధులు నిర్వహించిన అక్కడ అక్రమాలు మాములే. ఆ విషయాలు ఉన్నతధికారులకు తెలియంది కాదని బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయ సిబ్బంది సైతం సునీత వ్యవహారంపై అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన రెండు ఉదంతాలు
గతంలో ఒక వాహానం నెంబర్ ఏపీ12వీ6331, ఇంకోవాహానం నెంబర్ ఏంహెచ్03ఎన్9381. ఈ వాహనాల టెంపరరి పర్మిట్ కాంట్రాక్ట్ క్యారేజ్ విషయంలో రవాణశాఖ నియమ నిబంధనలు పాటించకుండా ఇతర రాష్ట్రాల వాహనాలకు అనుమతులు జారిచేసి అక్రమాలకు పాల్పడింది. దీంతో అమెపై చర్యలు తీసుకోవాలని అప్పటి రవాణశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా 2016 ఫిబ్రవరి 18న లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. ఆ కేసు విచారణలో ప్రస్తుత మలక్‌పేట్ ఆర్టీవో అధికారి కిష్టయ్యను విచారణ అధికారిగా నియమించారు.
వారం రోజుల క్రితం బండ్లగూడ ఆఫీస్‌లో వాహాన నెంబర్ టీఎస్ 12టీ4888 వాహనం ట్రాన్స్ఫర్ ఆఫ్ పర్మిట్ విషయంలో వాహనదారుడి నుంచి రూ.40 వేలు డిమాండ్ చేసింది. తన సహాయకుని ద్వారా 40 వేలు తీసుకుంది. దీంతో సదరు వాహనదారుడు రవాణశాఖ ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. స్పందించిన జాయింట్ కమిషనర్ సునీతను రవాణశాఖ ప్రధాన కార్యలయానికి ఆటాచ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు. సునీత వ్యవహారంపై దర్యాప్తు చేసి రిపోర్టు ఇవ్వాలని దక్షిణ మండల ప్రాంతీయ రవాణశాఖ కార్యలయం ఇంచార్జీ ఆర్టీవో కిష్టయ్యను ఆదేశించారు. గతంలో ఆమెపై వచ్చిన అవినీతి ఆరోపణలో దర్యాప్తు అధికారిగా ఉన్న కిష్టయ్యకే ఈ విచారణ భాద్యతలు అప్పగించడంతో సిబ్బంది ఏమి జరుగుతుందోనని ప్రశ్నించుకుంటున్నారు.
ప్రతి కేసు విచారణ అధికారిగా ఉన్నతాధికారులు ఆయననే ఎందుకు నియమిస్తున్నారో తెలియడంలేదని పలువురు ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ ఆర్టీఏ ఆఫీస్‌లో పనిచేసిన సమయంలో సునీతపై అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలున్నాయి. ఇప్పటికైన ఇలాంటి అవినీతి అధికారులను సస్పెండ్ చేయడం, లేదా నగర బయటి కార్యాలయాల్లో విధులు కేటాయించాలని సునీత తోటి ఉద్యోగులే పేర్కొంటూ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. భారీగా అవినితి ఆరోపణలు, విచారణలు ఎదుర్కొంటున్న అధికారిణికి సస్పెండ్ చేస్తారా లేదా మరోచోట పోస్టింగ్ ఇస్తారా అనే విషయంలో ఉద్యోగులు వేచి చూస్తున్నారు.
మళ్లీ ఇక్కడకే వస్తా
ప్రధాన కార్యాలయంలో అటాచ్గా ఉన్న సునీత తన పోస్టింగ్ బండ్లగూడలోనే వస్తుందని ధీమాగా ఉన్నట్లు తెలుస్తుంది. బండ్లగూడ కార్యాలయ సిబ్బందితో సునీత మాట్లాడుతూ ఏది ఏమైనా నేను ఇక్కడికే తిరిగి వస్తాను. అప్పుడు చూపిస్తాను తానేంటో అంటూ తోటి ఉద్యోగులతో మాట్లాడుతున్నట్లు విశ్వాసనీయ సమాచారం.