హైదరాబాద్ : రాష్ట్రంలో రోజురోజుకు శాంతిభద్రతులు క్షిణిస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో దోపిడీలు, దొంగత నాలు, హత్యలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తాజాగా పాతబస్తీలోని సంతోష్ నగర్లో మరో వ్యక్తి హత్యకు (Brutal murdered) గురయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మోహీద్ అనే యువకు డిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. స్థానికుల సమాచా రంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.