బన్సీలాల్ పేట్, ఏప్రిల్ 11 : అధిక పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలను ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని అంగన్ వాడీ టీచర్లు అన్నారు. శుక్రవారం బోలక్ పూర్లోని కృష్ణా నగర్ కాలనీ అంగన్ వాడీ కేంద్రంలో మహిళా, శిశువు సంక్షేమ శాఖ ద్వారా పోషణ్ పక్షోత్సవాలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులను పిలిచి తక్కువ ఖర్చుతో రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు, జొన్నలు లాంటి మిల్లెట్స్ తో ఇంట్లోనే అధిక పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలో వివరించారు. అనంతరం వివిధ ఆహార పదార్థాల ప్రదర్శనను నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్లు సావిత్రి, విజయరాణి, రూత, కుసుమ, అనిత, మంజుల, తల్లుల కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.