MLA Marri Rajasekhar Reddy | మల్కాజిగిరి, సెప్టెంబర్ 9: అంగన్వాడీ సెంటర్ల సమస్యలు పరిష్కరిస్తామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం బోయిన్పల్లి క్యాంపు కార్యాలయంలో అల్వాల్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ట్లాడుతూ.. టీచర్లు, సూపర్వైజర్ల సమస్యలు పరిష్కరిస్తామని, నెలనెలా టీచర్ల సమావేశాలకు ప్రభుత్వ పరంగా నూతన భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 77 అంగన్వాడీ సెంటర్లలో నీటి సదుపాయం, బాత్రూమ్స్ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ స్వాతి, సూపర్వైజర్లు జమశీల, వింధ్యావాహిని, టీచర్లు మీనాక్షి, రాణి, మమత, రాజ్యలక్ష్మి, శోభారాణి, రమాదేవి, విజయలక్ష్మి, సంధ్య, భాగ్యరేఖ తదితరులు పాల్గొన్నారు.