కాచిగూడ, జనవరి 20 : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. కాచిగూడ రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎలియా వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తి(55)బుద్వేల్-ఉందానగర్ రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.
మృతిని ఒంటిపై తెలుపు రంగు చొక్కా, నషం రంగు ప్యాంట్ ధరించి, ఎత్తు 5.4 ఉన్నట్లు తెలిపారు. మృతుని వివరాల కోసం 9949500741లో సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.