అంబర్‌పేట: అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధికారికంగా ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం అంబర్‌పేట ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు.
ఫ్లైఓవర్ సర్వీస్‌రోడ్డులో అసంపూర్తిగా ఉన్న పనుల నిర్మాణం విషయంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ కింద ఉన్న చెత్తాచెదారం, మట్టికుప్పలు తొలగించకపోవడం, గోడ నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడంపై అధికారుల తీరును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తప్పుపట్టారు.