Medchal | మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైంది. ఆదివారం ఉదయం కెమికల్ ట్యాంకర్ అదుపుతప్పి విగ్రహాన్ని ఢీకొనడంతో విగ్రహం పూర్తిగా పాడైంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్యాంకర్ డ్రైవర్‌తో పాటు యజమానిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నాకు దిగారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే కొత్త అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కెమికల్ ట్యాంకర్ నిర్వాహకులు.. కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది.