కరీంనగర్ కమాన్‌చౌరస్తా, మే 13: సీబీఎస్ఈ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చినట్లు ఆ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ టైనిటాన్స్ ప్రాంగణంలో విద్యార్థులను ఆయన అభినందించి మాట్లాడారు. పదో తరగతి, 12వ తరగతి ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆరంభం నాటి నుంచి ఘన విజయాల పరంపరను కొనసాగిస్తూ రాష్ట్ర విద్యారంగానికి దిక్సూచ్చిగా నిలుస్తున్నని హర్షం వ్యక్తం చేశారు.
పదో తరగతి ఫలితాల్లో 500 మారులకు మమోహ్మద్ షాజ్నెన్ తబస్సుమ్ జాతీయ స్థాయిలో 99.4 శాతంతో 497మారులు సాధిండమే కాకుండా జిల్లా స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఎం సుచీత్రెడ్డి 493, జే సుప్రభ 492, ఆర్ వేదిక, టీ హర్షిణి 491, డీ హర్షిత్ 489, బీ ఆక్రుతి, సీహెచ్ అనీష్‌కుమార్, రయానుద్దీన్ 488, ఏ నక్షత్ర, పీ శ్రీవర్షిత, కే నక్షత్రరెడ్డి 486, ఎస్ శాలిని, అబ్దుల్ రఫీ 484, డీ వివేక్ 483, టీ హర్షవర్ధన్, ఇ ప్రణీత్‌రెడ్డి 482, ఆర్య, కే విస్వజరెడ్డి 481, రమేసా ఫాతిమా, టీ అభిరామ్‌రెడ్డి 480 మార్కులు సాధించి ముందంజలో నిలువడమే కాకుండా జిల్లా స్థాయిలోనూ అత్యుత్తమ మారులను కైవసం చేసుకున్నారని ధీమా వ్యక్తం చేశారు.
12వ తరగతి ఫలితాల్లో..
అలాగే..12వ తరగతిలో వీ సంజీతరెడ్డి 96.4శాతంతో 482, ఎన్ అనిరుద్సాయి 482, వీ శశాంక్‌రెడ్డి 478, జె వమీకా 473, జె వమీకా 473, వీ శశాంక్ రెడ్డి 478, ఇ మృనాలిని 473, అబ్దుల్హాక్ 461, టీ సాయి 461, డీ శ్రీహాన్ కౌశిక్ 460, ఎన్ మైత్రేయి 456 మారులు సాధించి అత్యుత్తమ స్థానంలో నిలవడమే కాకుండా, జిల్లా స్థాయిలోనూ అత్యుత్తమ మారులు కైవసం చేసుకున్నారన్నారు. స్ఫూర్తిదాయకంగా విద్యార్థులు పదో తరగతిలో అత్యధిక సంఖ్యలో 90శాతం మారులు సాధించారని, 12వ తరగతి ఫలితాల్లో 13మంది విద్యార్థులు 90శాతం మారులు సాధించడం చారిత్రాత్మక విజయమని కొనియాడారు.