Rachakonda Police | సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ): పుట్టిన ఒకటి, రెండు రోజుల్లోనే వేల కిలోమీటర్ల నుంచి పిల్లలను తీసుకొచ్చి ..అక్రమ విక్రయాలు చేపడుతున్న ముఠాలో కీలక నిందితురాలు వందనను ఇటీవల రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పిరియేడ్స్ అయిన తరువాత మహిళల వద్ద నుం చి అండాలు(ఎగ్) డోనేషన్ చేయిస్తూ, వారికి కొన్ని డబ్బులు ఇచ్చి.. తాను ఈజీగా సంపాదించే మార్గాన్ని ఎంచుకున్న వందన… ఆ తరువాత పిల్లలను అక్రమంగా విక్రయించే దందాలోకి అడుగుపెట్టింది. ఈ పసిపిల్లలను గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు తెచ్చి విక్రయిస్తున్న ముఠాలు, పిల్లలను కొట్టేస్తున్నారా? కొంటున్నారా? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ప్రాథమిక విచారణలో కీలక నిందితురాలు పోలీసులకు తా ము పిల్లలను వారి తల్లిదండ్రుల వద్ద నుంచి కొంటున్నామని, కిడ్నాప్ చేయ డం లేదంటూ చెప్పుకొచ్చారు. ఈ మాటలను పోలీసులు పూర్తిస్థాయిలో నమ్మడం లేదు. దీంతో గతనెల 25న అరెస్టైయిన 11 మందిలో ముగ్గురు కీలక ఏజెంట్లను, తాజాగా అరెస్టైయిన వందనను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఈ అక్రమ పిల్లల విక్రయ ముఠాలకు సంబంధించిన పూర్తి సమాచారం వస్తుందని రాచకొండ పోలీసులు భావిస్తున్నారు.
పిల్లలు పుట్టని మహిళలు అండాలు కొంటూ గర్భం దాలుస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకున్న వందన.. పేదరికంతో ఉండే మహిళలను గుర్తించి, డ బ్బు ఆశ చూపించి దవఖానాలకు తీ సుకెళ్తుంది. అక్కడ వైద్యులతో మాట్లా డి డోనర్స్ నుంచి ఎగ్స్‌ను ఇప్పిస్తోంది. ఇందుకు రూ.5వేల నుంచి రూ.10 వే ల వరకు వందన తీసుకుంటూ అందు లో సగం ఎగ్ డోనర్లకు ఇస్తుంటుంది. అలాగే.. పిల్లలకు జన్మనిచ్చిన తరువాత పెంచిపోషించే శక్తి లేనివారిని గుర్తించి.. వారి పిల్లలను తక్కువ ధరకు కొని, ఎక్కువ ధరకు ఇతర ప్రాంతాల్లో విక్రయించాలని వందన ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే సోషల్‌మీడియా ద్వారా హైదరాబాద్‌కు చెందిన పాత నేరస్థురాలు కృష్ణవేణిని పరిచయం చేసుకుంది. తాను పిల్లలను హైదరాబాద్‌కు పంపిస్తానని ఆడబిడ్డకు రూ. 1.5 లక్షలు, మగ బిడ్డకు రూ. 2.5 లక్షలు ఇవ్వాలని ఇద్దరి మధ్య బేరం కుదిరిం ది. అహ్మదాబాద్‌కు చెందిన సునీత సుమన్, సావిత్రి దేవిలు పిల్లలను హైదరాబాద్‌కు తెచ్చి కృష్ణవేణి గ్యాంగ్‌కు అప్పగిస్తుంది. అయితే ఇందులో వందన అసలైన తల్లిదండ్రులకు రూ.50వేల నుంచి రూ.60 వేలు మా త్రమే ఇస్తుంది. మిగతాదంతా ఆమె తీసుకుంటుంది. ఇదిలాఉంటే కృష్ణవేణి గ్యాంగ్ ఆడబిడ్డను రూ. 4 లక్షలు, మగబిడ్డను రూ. 5 లక్షల వర కు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడయ్యింది.
వందన, కృష్ణవేణిలు నలుగురి పిల్లలను హైదరాబాద్‌కు తరలించడంతో పోలీసులు పట్టుకుని.. చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. మల్కాజిగిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ జానయ్య, చైనత్యపురి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల బృందాలు గుజరాత్లో కీలక నిందితురాలైన వందనను పట్టుకున్నారు. పిల్లలను ఎక్కడి నుంచి తెచ్చారని విచారించడంతో తాము పిల్లలను పెంచే స్థోమత లేని తల్లిదండ్రుల నుంచి కొని, అవసరమైన వారికి విక్రయించామంటూ ప్రాథమికంగా వెల్లడించింది. అయితే గతంలో నూ మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే దానికి మహారాష్ట్ర, ఢిల్లీతో సం బంధాలున్నాయి. గుజరాత్‌కు చెందిన వందనకు ఇతర ముఠాలతో సంబం ధాలున్నాయా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. అలాగే పిల్లల అసలైన తల్లిదండ్రులు వద్దనుకుంటే, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలోనే నిబంధనల మే రకు దత్తత ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకొని పూర్తి నెట్‌వర్క్‌పై ఆరా తీసిన తరువాతే ఈ కేసులో ఒక స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.