రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా యాచారంలోని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి నివాసంలో చైర్మన్ కోదండరెడ్డితో వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి, కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, మెంబర్ సెక్రెటరీ గోవిందు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో రైతులు వానకాలం సీజన్‌కు సిద్దమవుతున్న వేళా ఎరువులు, విత్తనాలు నిల్వలపై డైరెక్టర్ గోపిని కోదండరెడ్డి అడిగి తెలుసుకున్నారు.
కాగా, యాచారం మండలాన్ని ఉద్యానవ శాఖ పైలట్ ప్రాజెక్టు కింద కూరగాయల సాగు చేపట్టింది. ఇందులో భాగంగా యాచారంలోని రైతు వేదికలో కూరగాయలసాగు సాగుచేస్తున్న రైతులతో రైతు కమిషన్ బృందం, అధికారులు సమావేశయమయ్యారు.