అత్యాధునిక స్పైకామ్లతో.. షీ టీమ్స్ నజర్
అత్యాధునిక టెక్నాలజీతో ఈవ్‌టీజర్లను గుర్తించి పట్టుకుంటున్నామని నగర అదనపు పోలీస్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు.
- అమ్మాయిలను వేధిస్తున్న ఇద్దరు టీజర్లు పట్టివేత
- 10 రోజుల జైలు
- మరికొన్ని కేసులలో పలువురు అరెస్ట్
సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : అత్యాధునిక టెక్నాలజీతో ఈవ్‌టీజర్లను గుర్తించి పట్టుకుంటున్నామని నగర అదనపు పోలీస్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. షీ టీమ్స్ ఏర్పాటు చేసి 8 ఏండ్లవుతందని, ఈవ్టీజర్ల కోసం అధునిక స్పై క్యామ్‌లను అందుబాటులోకి తెచ్చి నిఘాను పటిష్టం చేశామన్నారు. ఇందులో షేక్ నజామ్ నయీం, మెహిన్ షేక్ అనే ఇద్దరిని నూతన స్పైకామ్లతో పట్టుకొని, కోర్టులో హాజరుపరచడంతో 10 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పిందని తెలిపారు.
షార్ట్ ట్రావెల్ కోసం వాహనం బుక్ చేసుకుంటే, ఆ వాహన డ్రైవర్ యాప్రాల్‌కు చెందిన కార్తిక్ బందాని బాధితురాలి ఫోన్ నెంబర్ తీసుకొని అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
పరిచయాన్ని ఆసరా చేసుకొని ప్రేమించాలని వేధిస్తున్న అమీర్‌పేట్‌కు చెందిన బి. శేఖర్‌పై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
ఓ సాఫ్ట్వేర్ సంస్థకు చెందిన హెచ్ఆర్ ఉద్యోగినికి గుర్తుతెలియని నెంబర్‌తో ఫోన్ చేసి వేధిస్తుండడంతో మేడ్చల్‌కు చెందిన సత్తిరెడ్డిని అరెస్ట్ చేశారు.
స్నేహంగా ఉంటూ ఆర్థిక సహాయం చేసిన పాపానికి బాధితురాలిని బ్లాక్మెయిల్ చేస్తూ వేధిస్తున్న మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన సాదానత్ను అరెస్ట్ చేశారు.
షాప్‌లోకి వెళ్లి సేల్స్ గర్ల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించిన వారాసీగూడకు చెందిన ఎండీ ఫరీదుద్దీన్‌ను
అరెస్ట్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

