హైదరాబాద్, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ) : యూరియాతోపాటు ఇతర అన్ని రకాల ఎరువులను ఇకపై ఫ్రేమ్వర్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్ (ఎఫ్ఎఫ్ఎస్) యాప్ ద్వారానే విక్రయిస్తారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపా రు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమ ల్లో ఉన్న జిల్లాలతోపాటు మరో పది జిల్లాలు నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, ఖమ్మం, భ ద్రాద్రి, మెదక్, వికారాబాద్ జిల్లా ల్లో ఎఫ్ఎఫ్ఎస్ యాప్ను అమలుచేస్తామని వివరించారు.
ఈ యాప్ ద్వారా రైతులు ఆధార్ ఆధారిత ధ్రువీకరణతో ఎరువులను సులభంగా కొనుగోలు చేయొచ్చని తెలిపారు. గురువా రం సచివాలయంలో నిర్వహించిన సమీక్ష లో మాట్లాడుతూ.. 2025-26 యా సంగిలో కొనుగోలు చేసిన జొన్నలకు సంబంధించిన రూ.994 కోట్లను 1,01,376 మంది రైతుల ఖాతాల్లో జమచేస్తున్నట్టు వెల్లడించారు.