Residential Schools | ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 31: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల పాఠశాలలో 5వ తరగతికి ప్రవేశానికి నిర్వహిం చే పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకులాల జోనల్ అధికరి కే నిర్మల, ప్రిన్సిపాల్ బి.వేణు గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ విద్యార్థులకు 5వ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించే అర్హత పరీక్షకు ఫిబ్రవరి 1 వరకు ఆన్లైన్లో రూ. 100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ప్రవేశం కోసం ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాను యూనిట్‌గా చేసుకుని ప్రవేశాలు ఉంటాయన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరి 23న ప్రవేశపరీక్ష ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకునే వారు వెబ్ సైట్ https:/ /tgswreis. telan gana, https://t gcet. cgg.go v.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.