సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన నలుగురు మెడికల్ ఆఫీసర్లపై మెమో జారీ చేస్తూ కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ చలాన్ల జారీలో పనితీరు మెరుగ్గా లేని చార్మినార్, మలక్‌పేట, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం సర్కిల్‌కు సంబంధించిన మెడికల్ ఆఫీసర్లకు మెమోలు జారీ చేశారు. మెడికల్ ఆఫీసర్లు ఇశ్రాత్ ఇక్బాల్, జ్యోతిబాయ్, శ్రీనివాస్, రవిలపై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.