జంట హత్యల నిందితుడి అరెస్ట్
చేబదులుగా తీసుకున్న నగదు చెల్లించకపోగా అవమానించే మాటలతో మానసికంగా వేధించడంతో హత్యలకు పాల్పడ్డ వ్యక్తిని మీర్‌చౌక్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో ఏసీపీ శ్యాం సుందర్ వివరాలు వెల్లడించారు. చార్మినార్ మసీద్ పహడిషరీఫ్ ప్రాంతానికి చెందిన అదిల్‌ఖాన్ (35) ఫ్యాబ్రికేషన్ పనులు చేస్తుండేవాడు.
చార్మినార్, ఏప్రిల్ 21 : చేబదులుగా తీసుకున్న నగదు చెల్లించకపోగా అవమానించే మాటలతో మానసికంగా వేధించడంతో హత్యలకు పాల్పడ్డ వ్యక్తిని మీర్‌చౌక్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో ఏసీపీ శ్యాం సుందర్ వివరాలు వెల్లడించారు. చార్మినార్ మసీద్ పహడిషరీఫ్ ప్రాంతానికి చెందిన అదిల్‌ఖాన్ (35) ఫ్యాబ్రికేషన్ పనులు చేస్తుండేవాడు. అతని సోదరుడు అఖీల్ఖాన్, మరదలు అజ్మీరాబేగంలు పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుల్తాన్పుర ప్రాంతంలో నివసిస్తున్నారు.
మరణించిన తన సోదరునికి సంతానం కలిగినా, తనకు లేకపోవడం వెలితిగా భావించేవాడు. అయితే అఖీల్ఖాన్, అదిల్‌ఖాన్ వద్ద పలుమార్లు తీసుకున్న చేబదులు తిరిగి ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం, వీరి మధ్య మరదలి జోక్యంతో కోపం పెంచుకున్న అదిల్‌ఖాన్ ప్లాన్ ప్రకారం సోమవారం అఖీల్ ఖాన్ ఇంటికి వచ్చే సమయంలో ఓ పదునైన కత్తి తెచ్చుకున్నాడు. సోమవారం జరిగిన ఘర్షణలో కోపోద్రిక్తుడైన అదిల్‌ఖాన్ ఇద్దరిని హత్యచేసి పారిపోయాడు. మంగళవారం విచారణలో భాగంగా నిందితుడి నివాసానికి వెళ్లగా, అక్కడే ఉన్న నిందితుడిని మీర్‌చౌక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి రక్తపు మరకలు ఉన్న వస్ర్తాలను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ శ్యాం సుందర్ తెలిపారు. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ కొండల్రావు, డీఐ సైదయ్య, ఎస్సైలు సంతోష్ కుమార్, అనిత ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

