హైదరాబాద్ : బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి(Accused) రంగారెడ్డి జిల్లా కోర్టు జీవితఖైదు(Life imprisonment) శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. 2016 సంవత్సరంలో సరూర్‌నగర్‌లోని ఓ బాలికపై హరీశ్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నిందితుడికి జీవితఖైదును విధించింది. అలాగే బాధితురాలికి రూ. 10లక్షలు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.