బంజారాహిల్స్, మే 23 : ప్రేమపేరుతో బాలికకు మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. లంగర్‌హౌజ్ ప్రాంతానికి చెందిన కార్తీక్(34) ప్రైవేటు ఉద్యోగం జీవనం సాగిస్తున్నాడు. భార్య గర్భవతి కావడంతోఅతడికి సాయం చేసేందుకు వచ్చిన బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన దూరపుబంధువైన బాలిక(17)కు మాయమాటలు చెప్పిన కార్తీక్ ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. గత కొన్నినెలలుగా బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. కాగా రెండునెలల క్రితం బంజారాహిల్స్‌లోని బాలిక నివాసం నుంచి ఆమెను తీసుకుని వెళ్లాడు.
ఈ వ్యవహారంపై బాలిక తల్లి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని బంధువుల ఇంటికి తీసుకువెళ్లినట్లు తేలడంతో పోలీసులు ఆమెను గుర్తించి తీసుకువచ్చారు. బాలిక ఇచ్చిన వాం గ్మూలం ప్రకారం మైనర్ మీద లైంగికదాడి చేసినట్లు తేలడంతో నిందితుడు కార్తీక్ మీద పోక్సో కేసు నమోదు చేశారు. ఈ మేరకు శుక్రవారం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.