జవహర్‌నగర్, మార్చి 9: జవహర్‌నగర్, లాలాగూడ పోలీస్‌స్టేషన్ ప్రాంతాల్లో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో నిందితుడిని జవహర్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాప్రాల్ పరిధి కౌకూర్ భరత్‌నగర్ ప్రాంతంలో నివసించే సుశీల(60)కి ముగ్గురు కూతుర్లు జ్ఞానేశ్వరి(45), లక్ష్మి(40), ఉమామహేశ్వరి(35)తో కలిసి నివసిస్తున్నారు.
కుమారుడు శివ ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్నాడు. సుశీల భర్త రైల్వేలో ఉద్యోగం చేస్తుండగా అనారోగ్యంతో మరణించాడు. కారుణ్య నియామకం కింది రెండో కూతురు లక్ష్మి(40)కి ఉద్యోగం రావటంతో అక్క జ్ఞానేశ్వరితో కలిసి లాలాగూడలో ఉంటున్నారు. సుశీల కుటుంబానికి ఉత్తర ప్రదేశ్ రాష్ర్టానికి చెందిన అరవింద్(45) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
అరవింద్‌కు వివాహం కాగా ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్నారు. లక్ష్మితో ఏర్పడిన పరిచయం కాసా ప్రేమకు దారితీసింది. జవహర్‌నగర్ యాప్రాల్ ప్రాంతంలో చిన్న కూతురు ఉమామహేశ్వరితో కలిసి ఉంటుంది. అరవింద్ ప్రేమకు తల్లి, కూతురు అడ్డువస్తున్నారని జ్ఞానేశ్వరితోపాటు తల్లి సుశీలను హత్య చేశాడు. ఈ హత్య అరవింద్ చేసి ఉంటాడని జవహర్‌నగర్ పోలీసులకు కూతురు ఉమామహేశ్వరి ఫిర్యాదు చేసింది. నిందితుడు అరవింద్‌ను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.