హైదరాబాద్: మాదాపూర్ ఇనార్బిట్ మాల్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు నలుగురు వ్యక్తులను ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలైనాయి. గాయపడిన వాళ్లందరూ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ఓని చట్నీస్ హోటల్లో పనిచేస్తున్నారుగా తెలుస్తోంది. వీళ్లంతా విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
గాయపడిన వారిని రాహుల్ గౌతం, పంకజ్, వినోద్, సూరజ్గా గుర్తించారు. కారులో ఉన్న వాళ్లంతా డాక్టర్లే కావడం గమనార్హం. వీళ్లంతా దుర్గం చెరువు సమీపంలోని ఫ్యూషన్ 9 పబ్బులో ఫుల్లుగా మద్యం తాగి ఈ ప్రమాదానికి కారకులయ్యారు. నిఖిల్ రెడ్డి అనే డాక్టరు మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేస్లూ.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిని డీ కొట్టినట్లు సమాచారం.
ఆ కారులో నిఖిల్తోపాటు మెండు తరుణ్, అఖిల్ కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో నిఖిల్ రెడ్డి ఆల్కహాల్ పర్సెంటేజి 116%గా ఉండగా, పక్క సీట్లో ఉన్న వ్యక్తి ఆల్కహాల్ శాతం 35 %గా ఉంది. వీరిపై కేసు నమోదు చేసుకొన్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.