హైదారాబాద్ : హనుమకొండ డిప్యూటీ కలెక్టర్ వెంకట్ రెడ్డి ఇంట్లో ఏసీబీ(ACB) అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. గత నెల 6వ తేదీన హనుమకొండ ఇన్చార్జి డీఈవోగా ఉన్నప్పుడు వెంకట్ రెడ్డి ఒక స్కూల్ పర్మిషన్ ఎక్సెటెండ్ కోసం లక్ష రూపాయలు డిమాండ్ చేసి ఏసీబీకి పట్టుబడ్డాడు. దీంతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో ఆయన్ను విచారించగా.. భారీగా ఆస్తులను కూడబెట్టినట్లు తేలడతో, అతని ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు దాదాపుగా 30 లక్షల రూపాయలు నగదు దొరికిందని ఏసీబీ అధికారులు తెలిపారు. బుధవారం హైదరాబాద్ రాక్ టౌన్ కాలనీలోని వెంకట్ రెడ్డి, అతడి బంధువుల ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది.
2008వ సంవత్సరంలో అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఉన్నట్లు మా దృష్టికి వచ్చిందని ఏసీబీ వరంగల్ జాయింట్ డైరెక్టర్ రాజేష్ మురళి తెలిపారు. అలాగే 2016, 2017 వ సంవత్సరంలో నేషనల్ హైవే స్కీమ్ లో రైతులకు ఇవ్వాల్సిన పరిహారం అందించడంలో మోసాలకు పాల్పడ్డాడని ఆయన తెలిపారు. అందులో భాగంగా సోదాలు నిర్వహించగా ఈరోజు దాదాపుగా రూ.8కోట్ల 30లక్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించామన్నారు. మంచిరేవులలోని విల్లా సుమారు 6కోట్లు, భువనగిలో ఒక ఫామ్‌హౌస్, సరూర్ నగర్లో ఒక ఇల్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది చోట్ల ఎనిమిది బృందాలతో సోదాలు చేపట్టామని ఆయన తెలిపారు.