హైదరాబాద్: విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు (ACB Raids) నిర్వహించారు. మణికొండలోని నివాసంతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధుల ఇండ్లలోనూ సోదాలు చేస్తున్నారు. మాదాపూర్, గచ్చిబౌలితోపాటు మొత్తం 15 చోట్ల 15 బృందాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నయాన్న ఆరోపణల నేపథ్యంలో సోదాలు చేస్తున్నారు.