ACB Raids | దుండిగల్, మే 7: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ సబ్‌స్టేషన్ అసిస్టెంట్ ఇంజనీర్(ఆపరేషన్)గా పనిచేస్తున్న జ్ఞానేశ్వర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ.10 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు.
మిథిలా నగర్‌లోని ఓ బిల్డింగ్ ముందు ఉన్న ట్రాన్స్ఫార్మర్ కేవీ లైన్ మార్చేందుకు నెల రోజుల క్రితం కాంట్రాక్టర్‌ను రూ.50వేలు లంచం డిమాండ్ చేశాడు. చివరకు రూ.30 వేలకు బేరం కుదిరింది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం తన కార్యాలయంలోనే సదరు కాంట్రాక్టర్ నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా పక్కా సమాచారంతో అప్పటికే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు జ్ఞానేశ్వర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీబీ డీసీపీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రగతినగర్‌లోని ఏఈ కార్యాలయంతో పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఏఈ నివాసంలోనూ తనిఖీలు చేశామని చెప్పారు. అలాగే ఆఫీసు వద్ద ఉన్న కారులోనూ సోదాలు చేశారు.