సిటీబ్యూరో: శామీర్‌పేట ఎస్ఐ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం… పరశురామ్ శామీర్‌పేట ఠాణాలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఇద్దరు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదైంది. తమను కేసులో నుంచి తప్పించడంతో పాటు సీజ్ చేసిన సెల్ఫోన్లను తిరిగి ఇచ్చేందుకు నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నుంచి ఎస్ఐ రూ.2 లక్షలు తీసుకున్నారు.
సెల్ఫోన్ల కోసం మరో రూ. 22 వేలు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు సోమవారం లంచం తీసుకున్న ఎస్ఐని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేశారు. అనంతరం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.