Suicide | కాచిగూడ, జూలై 5 : డెమో రైలు కిందపడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే సీఐ ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని యువకుడు(25) శనివారం విద్యానగర్ – కాచిగూడ రైల్వే స్టేషన్ల మధ్య కాచిగూడ పూర్ణ డెమో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి ఒంటిపై తెలుపు రంగు ఫుల్ చొక్కా, నీలి రంగు జీన్స్ ప్యాంట్ ధరించి, ఎత్తు 5.5 ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుని వివరాలకు 8712658584 లో సంప్రదించాలని సిఐ కోరారు.